Tomato Garland: టమాటాల దండతో రాజ్యసభకు ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Garland: దేశంలో ఇప్పుడు టమాటాల రేట్లు సెంచరీ దాటి.. కొన్ని చోట్ల డబుల్ సెంచరీలకు దగ్గరపడుతున్నాయి. అంత రేటున్న టమాటాలతో దండను చేసుకొని .. అది వేసుకొని ఎంపీ ఒకరు రాజ్యసభకు హాజరయ్యారు. టమాటాలతో రాజ్యసభకు హాజరైన ఎంపీపై రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం తాను దేశంలో టమాటాల ధరలు పెరిగాయన చెప్పడానికి చేసినట్టు తెలిపారు.
Read also: Imran Khan: పురుగుల జైల్లో ఉండలేను.. మార్చేయండి
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. నిన్న మొన్నటిదాకా బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.200 ఉంది. ఈ క్రమంలో ధరలు తగ్గేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తుంటే సామాన్యులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాట ధరల పెరుగుదలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా టమాటాల ధర పెరుగుదలపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పార్లమెంట్ సమావేశాలకు టమాటాల దండ ధరించి వచ్చారు. రాజ్యసభలో ఆయన మెడలో టమాటాల దండ చూసి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్ కుమార్ తీరు తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ‘‘పార్లమెంటు సభ్యులుగా మన ప్రవర్తనకు ఒక పరిధి ఉంటుంది. గౌరవ సభ్యుడు సుశీల్ కుమార్ గుప్తా సభకు హాజరైన తీరు చూసి రాజ్యసభ ఛైర్మన్‌గా ఎంతో బాధ పడుతున్నా. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రతిపక్ష నాయకుడితో చర్చిస్తా’’ అని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. సుశీల్ కుమార్ టమాటా దండతో సభకు వెళుతున్న వీడియోను ఆప్ తన ట్విటర్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. టమాటాల దండతో రాజ్యసభకు హాజరైన ఎంపీపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
- Tags
- Garland
- mp
- Parlament
- Rajya Sabha
- tomato
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి