Site icon NTV Telugu

Tomato Garland: టమాటాల దండతో రాజ్యసభకు ఎంపీ

Tomato Garland

Tomato Garland

Tomato Garland: దేశంలో ఇప్పుడు టమాటాల రేట్లు సెంచరీ దాటి.. కొన్ని చోట్ల డబుల్‌ సెంచరీలకు దగ్గరపడుతున్నాయి. అంత రేటున్న టమాటాలతో దండను చేసుకొని .. అది వేసుకొని ఎంపీ ఒకరు రాజ్యసభకు హాజరయ్యారు. టమాటాలతో రాజ్యసభకు హాజరైన ఎంపీపై రాజ్యసభ ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం తాను దేశంలో టమాటాల ధరలు పెరిగాయన చెప్పడానికి చేసినట్టు తెలిపారు.

Read also: Imran Khan: పురుగుల జైల్లో ఉండలేను.. మార్చేయండి

దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. నిన్న మొన్నటిదాకా బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.200 ఉంది. ఈ క్రమంలో ధరలు తగ్గేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తుంటే సామాన్యులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాట ధరల పెరుగుదలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్‌ గుప్తా టమాటాల ధర పెరుగుదలపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు టమాటాల దండ ధరించి వచ్చారు. రాజ్యసభలో ఆయన మెడలో టమాటాల దండ చూసి ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్‌ కుమార్‌ తీరు తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ‘‘పార్లమెంటు సభ్యులుగా మన ప్రవర్తనకు ఒక పరిధి ఉంటుంది. గౌరవ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ గుప్తా సభకు హాజరైన తీరు చూసి రాజ్యసభ ఛైర్మన్‌గా ఎంతో బాధ పడుతున్నా. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రతిపక్ష నాయకుడితో చర్చిస్తా’’ అని జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. సుశీల్‌ కుమార్‌ టమాటా దండతో సభకు వెళుతున్న వీడియోను ఆప్‌ తన ట్విటర్‌ (Twitter) ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. టమాటాల దండతో రాజ్యసభకు హాజరైన ఎంపీపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Exit mobile version