NTV Telugu Site icon

Sudha Murty: హిందీ వివాదంపై సుధా మూర్తి కీలక వ్యాఖ్యలు

Sudhamurty

Sudhamurty

ప్రస్తుతం తమిళనాడులో హిందీ వివాదం నడుస్తోంది. కేంద్రం బలవంతంగా తమిళనాడుపై హిందీ రుద్దుతోందని డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ ప్రారంభమైన దగ్గర నుంచి డీఎంకే సభ్యులు… ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు తమిళనాడులో త్రిభాషా ఉద్యమాన్ని బీజేపీ ప్రారంభించింది. ఇలా హిందీ వివాదం జాతీయ స్థాయిలో ఉద్రిక్తంగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: Indian Embassy: అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు

తాజాగా ఇదే అంశంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి స్పందించారు. ఒక వ్యక్తి బహుళ భాషలు నేర్చుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవచ్చన్నారు. అంతెందుకు తనకు 7-8 భాషలు తెలుసు అని సుధా మూర్తి చెప్పుకొచ్చారు. ఈ మేరకు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా విధానం కరెక్టేనని ఆమె చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: USA-India Tariffs: అమెరికా ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన వైట్ హౌస్

ఇక విద్యాశాఖ పనితీరు కూడా మెరుగుపడాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ ఉండాలని తెలిపారు. ప్రతి మూడేళ్లకోసారి వారికి కూడా టెస్టులు నిర్వహించి.. వారి యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించాలని చెప్పారు. లేదంటే ఉపాధ్యాయులు మెరుగుపడరని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పనితీరు బాగుంటేనే స్టూడెంట్ భవిష్యత్ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జీవితంలో తల్లి ప్రేమ తప్ప ఏదీ ఉచిత కాదని.. మంచి ఉపాధ్యాయుడు కావాలంటే వారికి మూడేళ్లకోసారి శిక్షణ ఇచ్చి పరీక్షలు పెట్టాల్సిందేనని సుధామూర్తి చెప్పుకొచ్చారు.