NTV Telugu Site icon

Rajnath Singh: సరిహద్దులు దాటేందుకు వెనుకాడం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

పాకిస్థాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. 1971 ఇండియా-పాక్‌ యుద్ధంలో పాల్గొన్న మాజీ అసోం వెటరన్స్‌ సన్మానసభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని హంతం చేయడంలో భారత​ దీటుగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు చెప్పడంలో విజయవంతం అయ్యామన్నారు.. ఇక, ఉగ్రవాద చర్యలతో దేశ సరిహద్దులు దాటి వచ్చి భారత్‌ను టార్గెట్‌ చేస్తే.. మేం ఏ మాత్రం వెనక్కి తగ్గం.. తాము కూడా బోర్డర్‌ దాటడానికి వెనుకడుగు వేసేది లేదని హెచ్చరించారు. ఇక, దేశ పశ్చిమ సరిహద్దుతో పోల్చుకుంటే.. తూర్పు సరిహద్దులో శాంతి, స్థిరత్వం నెలకొందని తెలిపారు.. బంగ్లా స్నేహపూర్వక పొరుగు దేశమని.. అందుకే తూర్పు సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం లేదన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌.

Read Also: Rajasthan: అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా రాజీనామా లేఖ సోనియా వద్దే..!