Rajnath Singh: ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ‘‘ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాల అణుబాంబు’’ తన వద్ద ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ఆ అణుబాంబును పేల్చాలని సవాల్ విసిరారు. “రాహుల్ గాంధీ తన వద్ద అణు బాంబు ఉందని చెబుతున్నారు. అలా అయితే, అతను దానిని వెంటనే పేల్చాలి. అతను తనకు హాని జరగకుండా చూసుకోవాలి” అని ఎద్దేవా చేశారు.
Read Also: IND vs ENG: భారత్‌ది కూడా ‘బజ్‌బాల్’ ఆటే.. బిత్తరపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్! ఆధిక్యం 166
బీజేపీకి ఎన్నికల కమిషన్ ‘‘ఓటు దొంగతనం’’ చేసిందని నిరూపించడానికి తన పార్టీ వద్ద ‘‘అణుబాంబు’’ ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. దీనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. భారత ఎన్నికల కమిషన్ ప్రశ్నించలేని సమగ్రతకు పేరుగాంచిన సంస్థ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని, రాజ్యాంగ సంస్థ గురించి పనికిమాలిన ప్రకటనలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని రాజ్‌నాథ్ అన్నారు. ఆయన సొంత పార్టీ చేతులకే రక్తం ఉందని, 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. బీహార్‌లో గత 20 ఏళ్ల పాలనలో నితీష్ కుమార్ అభివృద్ధి చేశారని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.
