NTV Telugu Site icon

kidney Operation: ఎడమ కిడ్నీ బదులు, కుడి కిడ్నీ తొలగింపు.. మహిళ పరిస్థితి విషమం..

Kidney

Kidney

kidney Operation: రాజస్థాన్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని జుంజునులో కిడ్నీలో రాళ్లు ఉండటంతో మహిళను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పాడైన ఎడమ కిడ్నీని తీయాల్సిన వైద్యులు, మంచిగా పనిచేస్తున్న కుడి కిడ్నీని శరీరం నుంచి తొలగించారు. తన భార్య ఆరోగ్యవంతమైన కిడ్నీని తొలగించారని భర్త ఆరోపించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాను ఆపరేషన్ సరిగానే చేశానంటూ వైద్యుడు ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ధంఖర్ ఆస్పత్రిలో డాక్టర్ సంజయ్ ధంఖర్ ఈ ఆపరేషన్ చేశారు.

బాధితురాలని నువా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఈద్ బానోగా గుర్తించారు. ఆమె గత కొంత కాలంగా కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతోంది. దీని కారణంగా ఆస్పత్రికి వెళ్లారు. కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత, కిడ్నీలో రాళ్ల వల్ల కిడ్నీ పాడైపోయిందని, దానిని అత్యవసరంగా తొలగించాలని డాక్టర్ ధంఖర్, బానోకి తెలియజేశాడు. బానో కుటుంబం ఆపరేషన్‌కి అంగీకరించింది. మే 15న శస్త్రచికిత్స జరిగింది. అయితే, డాక్టర్ ధంఖర్ దెబ్బతిన్న ఎడమ కిడ్నీకి బదులుగా, ఆరోగ్యం ఉన్న కుడి కిడ్నీని తొలగించారని కుటుంబం ఆరోపించింది.

Read Also: Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్..

ఆపరేషన్ జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ ధంఖర్ ఆమెను జైపూర్‌లో చికిత్స కోసం తీసుకెళ్లాలని సూచించారు. మే 15న ఆమెకు జరిగిన ఆపరేషన్ గురించి ఎవరికీ చెప్పద్దని చెప్పిటన్లు బానో కుటుంబ చెప్పింది. ఆమెను సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి చేర్చినప్పుడు, వేరే మార్గం లేక ఆమెను ఇంటికి తిరిగి పంపించారు. వైద్యుల నిర్లక్ష్యం బయటపడటంతో డాక్టర్ ధంఖర్, బానో కుటుంబాన్ని కలుసుకుని, ఆమె వైద్యానికి డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. అయితే, ఆమె కుటుంబం ఈ ప్రతిపాదనను ఒప్పుకోకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసింది. బానో భర్త షబ్బీర్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి ధన్‌ఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

డాక్టర్ మాత్రం బానో కుటుంబ ఆరోపణల్ని ఖండించారు. ఆమె కుడి కిడ్నీ పాడైపోయిందని, దాని కారణంగానే తొలగించానని చెప్పాడు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజ్‌కుమార్ డాంగీ ఐదుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఆసుపత్రి రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.డాక్టర్ ధంఖర్ జుంజునులోని బీడీకే ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్‌గా చేరాడు, రోగి మరణించిన తర్వాత 2017లో సస్పెండ్ చేయబడ్డాడు.