Site icon NTV Telugu

Rajasthan: ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం.. ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం.. వెలుగులోకి ఇలా..!

12

12

వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరతాయని పెద్దలు అంటుంటారు. ఇది సామెతే అయినప్పటికీ.. ఇది అక్షరాల నిజం కూడా. అచ్చం అదే మాదిరిగా రాజస్థాన్‌‌కు చెందిన ఒక అధికారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు

రాజ్‌కాంప్ ఇన్ఫో సర్వీసెస్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా ప్రద్యుమాన్ దీక్షిత్ పనిచేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ టెండర్లను దక్కించుకున్నాయి. ఓరియన్‌ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. అయితే ప్రద్యుమాన్ దీక్షిత్ ఇదే అవకాశంగా ఘరానా మోసానికి తెగబడ్డాడు. రెండు కంపెనీల్లో భార్య పూనమ్ దీక్షిత్ పని చేస్తున్నట్లుగా  రూ.37.54 లక్షల జీతం పుచ్చుకుంది. దాదాపుగా రెండేళ్లుగా ఏ ఆఫీసుకూ వెళ్లకుండానే పూనమ్ దీక్షిత్ జీతం అందుకుంది. మొత్తానికి పాపం పడి యవ్వారం బయటపడింది.

ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

రాజస్థాన్ హైకోర్టులో ఒక ఫిర్యాదుదారుడు పిటిషన్ దాఖలు చేయడంతో బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ (ACB) ఈ ఏడాది జూలై 3న ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో అక్రమంగా జీతం అందుకుంటున్నట్లు తేలింది. ప్రైవేటు కంపెనీలకు టెండర్లు దక్కేలా చేసినందుకు ప్రతిఫలంగా ప్రద్యుమాన్ తన భార్యను నియమించుకోవాలని.. నెలవారీ జీతం అందించాలని కోరాడు. దీంతో ఆ రెండు కంపెనీలు.. ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ కంపెనీలు రూ.37.54 లక్షల జీతం అందించాయి. జనవరి 2019-సెప్టెంబర్ 2020 మధ్య పూనమ్ దీక్షిత్.. ఐదు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఓరియన్‌ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ డబ్బును బదిలీ చేశాయని దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు రూ. 37,54,405 జీతంగా పంపించాయి. ఈ రెండేళ్ల కాలంలో పూనమ్ దీక్షిత్ ఎప్పుడూ కార్యాలయాలను సందర్శించలేదని తేలింది. ప్రద్యుమన్ దీక్షిత్ స్వయంగా భార్య నకిలీ హాజరు నివేదికలను ఆమోదించాడు. ‘ఫ్రీలాన్సింగ్’ ముసుగులో ఈ దందా అంతా నిర్వహించినట్లు బయటపడింది.  ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Cyclone Montha: ఈ రాత్రే తుఫాన్‌గా మారనున్న వాయుగుండం!

Exit mobile version