NTV Telugu Site icon

BJP: ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. మాట నిలబెట్టుకున్న మంత్రి.. ఏం చేశారంటే..

Bjp

Bjp

BJP: గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. 25 ఎంపీ సీట్లకు గానూ ఈ సారి బీజేపీ కేవలం 14 చోట్ల విజయం సాధించింది. 10 స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుచుకుంది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గద్దె దించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా కూడా రాజస్థాన్‌లో బీజేపీ అనుకున్నంతగా ఫలితాలు సాధించలేదు.

Read Also: Gujarat : 141 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్.. యూనివర్సిటీ పరీక్షపై వివాదం

ఇదిలా ఉంటే బీజేపీ గెలుపుపై పందెం కాసిన రాజస్థాన్ మంత్రి, బీజేపీ నేత కిరోడీ లాల్ మీనా తన మాట నిలబెట్టుకున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ఏడు ఎంపీ స్థానాల గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది. తన బాధ్యత కింద ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్క స్థానంలో అయిన బీజేపీ ఓడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో అతను ప్రాతినిధ్యం వహించే దౌసాతో పాటు మరికొన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో కిరోడీ మీనా రాజీనామా చేశారు. 10 రోజుల క్రితమే ఆయన ముఖ్యమంత్రికి రాజీనామా ఇచ్చినట్లు అతని సన్నిహితుడు చెప్పారు.

గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, మీనా సవాయి మాధోపూర్ నుండి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 200 అసెంబ్లీ స్థానాలకు గానూ 115 స్థానాల్లో గెలుచుకుంది. 66 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, లోక్‌సభ ఎన్నికలకు వచ్చే25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది, మిత్ర పక్షాలతో కలసి 11 స్థానాల్లో విజయం సాధించింది.