BJP: ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. మాట నిలబెట్టుకున్న మంత్రి.. ఏం చేశారంటే..
- మాట నిలబెట్టుకున్న రాజస్థాన్ మంత్రి..
- బీజేపీ ఓటమితో మంత్రి పదవికి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. 25 ఎంపీ సీట్లకు గానూ ఈ సారి బీజేపీ కేవలం 14 చోట్ల విజయం సాధించింది. 10 స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుచుకుంది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గద్దె దించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా కూడా రాజస్థాన్‌లో బీజేపీ అనుకున్నంతగా ఫలితాలు సాధించలేదు.
Read Also: Gujarat : 141 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్.. యూనివర్సిటీ పరీక్షపై వివాదం
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
ఇదిలా ఉంటే బీజేపీ గెలుపుపై పందెం కాసిన రాజస్థాన్ మంత్రి, బీజేపీ నేత కిరోడీ లాల్ మీనా తన మాట నిలబెట్టుకున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ఏడు ఎంపీ స్థానాల గెలుపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది. తన బాధ్యత కింద ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్క స్థానంలో అయిన బీజేపీ ఓడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో అతను ప్రాతినిధ్యం వహించే దౌసాతో పాటు మరికొన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో కిరోడీ మీనా రాజీనామా చేశారు. 10 రోజుల క్రితమే ఆయన ముఖ్యమంత్రికి రాజీనామా ఇచ్చినట్లు అతని సన్నిహితుడు చెప్పారు.
గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, మీనా సవాయి మాధోపూర్ నుండి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 200 అసెంబ్లీ స్థానాలకు గానూ 115 స్థానాల్లో గెలుచుకుంది. 66 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, లోక్‌సభ ఎన్నికలకు వచ్చే25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది, మిత్ర పక్షాలతో కలసి 11 స్థానాల్లో విజయం సాధించింది.
- Tags
- bjp
- Kirodi Lal Meena
- Rajasthan
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?