Site icon NTV Telugu

Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’

Interresult

Interresult

రాజస్థాన్‌లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో నికిత అనే బాలిక 93.88 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచింది. కానీ ఈ విజయాన్ని చూడడానికి ఆమె భూమ్మీద లేకపోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నికిత మరణం వెనుక ఉన్న అంతులేని గాథ కన్నీళ్లు రప్పిస్తున్నాయి.

నికిత శ్రీగంగానగర్‌ ప్రాంతానికి చెందిన వాసి. తల్లిదండ్రులు దినసరి కూలీలు. అయితేనేమీ చదువులో మంచి ప్రతిభ కలిగిన అమ్మాయి. శ్రీగంగానగర్‌లోని 7 కేఎన్ రావల్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు అయినప్పటికీ చదువులో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అయితే నికిత గత కొద్దిరోజులుగా హెపటైటిస్, మధుమేహంతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధులు తీవ్రం కావడంతో 10 రోజుల క్రితం (మార్చి 20, 2026) ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబంలో.. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

తాజాగా మంగళవారం 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నికిత 93.88 శాతం మార్కులతో విజయం సాధించింది. ఫలితాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమార్తెను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాష్ట్రమంతటా తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోతే.. నికిత తల్లిదండ్రులు మాత్రం దు:ఖంలో మునిగిపోయారు. ఈ పరిణామం పలువురిని కంటతడి పెట్టించాయి. వ్యాధులు బాధించినా చదువులో ఏ మాత్రం వెనుకంజ వేయలేదని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు.

ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ

ఈ సంవత్సరం 12వ తరగతి బోర్డు పరీక్షలకు సుమారు 8.5 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..8 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో అమ్మాయిలు టాప్‌గా నిలిచారు. 96.42 శాతంతో బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులు కాగా.. 92.64 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.

ఇది కూడా చదవండి: Opinion Polls Survey: బెంగాల్‌పై తాజా సర్వే వచ్చేసింది.. ఈసారి గెలవబోయేది ఎవరంటే..!

Exit mobile version