Site icon NTV Telugu

Rajasthan: 17 బాలిక, 20 ఏళ్ల మహిళా టీచర్ మిస్సింగ్.. “లవ్ జిహాద్” అని ఆరోపణలు..

Rajasthan

Rajasthan

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో 17 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల ముస్లిం మహిళా టీచర్‌తో కలిసి అదృశ్యమయ్యారు. ఈ ఘటన బికనీర్ లో జరిగింది. అయితే కావాలనే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని మైనర్ బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక చదివే ప్రైవేట్ కాలేజీలో ఉపాధ్యాయురాలు నిదా బహ్లీమ్ పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

Read Also: Marriage: అక్కడ పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇష్ట పడుతున్నారు.. ఎందుకు?

ఇదిలా ఉంటే ఆ అదృశ్యం వెనక ‘లవ్ జిహాద్’ కోణం ఉందని బీజేపీ, పలు హిందూ సంఘాలు ఆరోపిస్తు్న్నాయి. మా అమ్మాయిని హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మార్చేందుకు కిడ్నాప్ చేసినట్లు మైనర్ బంధువులు ఆరోపిస్తున్నారు. 12వ తరగతి చదువులునన బాలిక జూన్ 30న అదృశ్యమైన తర్వాత బంధువులు స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ మిస్సింగ్ వ్యవహారంలో ఉపాధ్యాయురాలని అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గత రెండు నెలలుగా సదరు మహిళా టీచర్ బాలికతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుందని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. జూన్ 30న ఇంటి నుంచి వెళ్లిన బాలిక స్కూల్ కి వెళ్లలేదని తేలింది. అయితే రెండు రోజుల తర్వాత వీరిద్దరిని జైపూర్ రైల్వే స్టేషన్ లో గుర్తించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలో మైనర్ బాలిక, ఆమె టీచర్ కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. విద్యార్థిని, ఆమె టీచర్ ను పట్టుకునేందుకు పోలీస్ టీములు రంగంలోకి దిగాయి. బికనీర్‌లోని శ్రీ దున్‌గర్‌ఘర్ పట్టణంలోని వ్యాపారులు మంగళవారం మార్కెట్‌ల బంద్‌ చేసి ఈ ఘటనకు నిరసన తెలిపారు.

Exit mobile version