NTV Telugu Site icon

పంజాబ్ ప‌రిణామాల‌పై ఆ ముఖ్య‌మంత్రులు కీల‌క వ్యాఖ్య‌లు…

పంజాబ్‌లో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కెప్టెన్ రాజీనామా త‌రువాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రిగా చ‌న్నిని ఎంపిక చేసింది.  చ‌న్నీ ప్ర‌మాణ స్వీకారం త‌రువాత పీసీపీ అధ్య‌క్షుడు సిద్ధూ రాజీనామా చేయ‌డం, ఆ త‌రువాత రాజీ కుద‌ర‌డంతో తిరిగి ఆయ‌న త‌న రాజీనామాను వెన‌క్కి తీసుకోవ‌డంతో అక్క‌డ ఏ క్ష‌ణంలో ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో చెప్ప‌లేని విధంగా ఉన్నాయి.  పంజాబ్ రాజ‌కీయాల‌ను రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌డ్ ముఖ్య‌మంత్రులు వెయిక‌ళ్ల‌తో గ‌మ‌నిస్తున్నారు.  పంజాబ్ లో జ‌రిగిన‌ట్టుగానే రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌డ్‌లో కూడా జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో ముందునుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. పంజాబ్‌లో ఐదేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ చెబుతుండ‌గా, పంజాబ్ ప‌రిస్థితులు త‌మ రాష్ట్రంలో రావని చ‌త్తీస్‌గ‌డ్ ముఖ్య‌మంత్రి బ‌ఘేల్ చెబుతున్నారు.  రాజ‌స్థాన‌ల్లో ప్ర‌జా వ్య‌తిరేక‌త లేద‌ని, వ‌చ్చే ఎన్న‌క‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజ‌యం అని ధీమా వ్య‌క్తం చేస్తుండ‌గా, చ‌త్తీస్‌గ‌డ్‌లో  కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌ఘేల్ చెబుతున్నారు.  ఒప్పంద‌లో భాగంగా రెండున్న‌ర ఏళ్ల త‌రువాత ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆరోగ్య‌శాఖ మంత్రి సింగ్‌దేవ్‌కు అప్ప‌గించాలి.  కానీ అందుకు ముఖ్య‌మంత్రి బ‌ఘేల్ స‌సేమిరా అన‌డంతో వివాదాలు భ‌గ్గుమ‌న్నాయి.  

Read: ఆ పేరుతోనే వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌… చేవెళ్ల నుంచి మొద‌లుపెట్టి…