ఆ పేరుతోనే వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌… చేవెళ్ల నుంచి మొద‌లుపెట్టి…

వైఎస్ ష‌ర్మిల వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే.  అక్టోబ‌ర్ నుంచి ష‌ర్మిల పాద‌యాత్ర చేప‌ట్ట‌బోతున్న‌ట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించారు.  అయితే, పాద‌యాత్ర‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌ను విధివిధానాల‌పై ష‌ర్మిల ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో ఇప్ప‌టికే చ‌ర్చించారు.  గ‌తంలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ‌లో చేప‌ట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర పేరుతోనే యాత్రను కొన‌సాగించాల‌ని వైఎస్ ష‌ర్మిల నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.  గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎక్క‌డి నుంచైతే పాద‌యాత్ర‌ను ప్రారంభించారో అక్క‌డి నుంచే అంటే చేవెళ్ల నియోజ‌క వర్గం నుంచే పాద‌యాత్ర‌ను చేప‌ట్టేందుకు ష‌ర్మిల సిద్ధం అవుతున్నారు.  ఏడాదిపాటు పాద‌యాత్ర కొన‌సాగేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.  చేవెళ్లలో ప్రారంభించి తిరిగి చేవెళ్లలో ముగిసేలా పాద‌యాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.  

Read: హుజురాబాద్ బీజేపీ అభ్య‌ర్ధిగా ఈట‌ల…

-Advertisement-ఆ పేరుతోనే వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌... చేవెళ్ల నుంచి మొద‌లుపెట్టి...

Related Articles

Latest Articles