Raj Thackeray: 13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు.
Read Also: Conversion racket: “హిందూ బాలికల”కు వల.. 2050 నాటికి భారత్‌లో ఇస్లాం వ్యాప్తి చేయడమే లక్ష్యం..
రాజ్ ఠాక్రేతో పాటు ఎంఎన్ఎస్ నాయకులు బాలా నందగావ్‌కర్, నితిన్ సర్దేశాయ్‌లు ఉద్ధవ్ ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారు. ఇద్దరు కజిన్స్ ఇటీవల తన మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేసే నిర్ణయంపై పోరాటంలో ఈ ఇద్దరు నేతలు కలిశారు. రెండు దశాబ్ధాల కాలంలో ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. తమ పోరాటంతోనే హిందీపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విజయ ర్యాలీని నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోరాడుతాయని చెప్పారు. ఉద్ధవ్‌తో విభేదాల కారణంగా రాజ్ 2005లో శివసేన నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ ఎంఎన్ఎస్ ను స్థాపించారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నారు.
