Site icon NTV Telugu

Delhi Rain: ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం.. ప్రజలకు ఇక్కట్లు

Delhirain

Delhirain

ఉత్తర భారత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వర్షంతో పాటు భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కురుస్తోంది. దీంతో నగర వాసులు ఇక్కట్లు పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక గణతంత్ర దినోత్సవం కోసం కర్తవ్య పథ్ దగ్గర చేస్తున్న రిహార్సల్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ

ఇక హిమాచల్ ప్రదే‌శ్‌లోని మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో పర్యాటకులు ఉల్లాసంగా… ఉత్సాహంగా గడుపుతున్నారు. అలాగే జమ్మూ మరియు కాశ్మీర్‌లో కూడా వర్షం కురుస్తోంది. శీతల గాలులు, చల్లని వాతావరణం మధ్య నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

ఇది కూడా చదవండి: Jharkhand Video: జార్ఖండ్‌లో తప్పిన రైలు ప్రమాదం.. లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రక్కును ఢీకొన్న రైలు

ఢిల్లీకి భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ నౌకాస్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే హర్యానాలోని రోహ్తక్, ఝజ్జర్, ఫరూఖ్ నగర్, మహేంద్రగఢ్, నార్నాల్ వంటి జిల్లాల్లో కూడా వర్షం, గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ కూడా వర్ష ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని చెప్పింది.

Exit mobile version