Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్ చోరీ.. స్పందించిన రైల్వేశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్‌ను కొంతమంది దొంగలు మాయం చేశారని.. సొరంగంలోకి ఇంజిన్‌ను తీసుకువెళ్లి ముక్కలుగా మార్చి వివిధ జిల్లాలోని స్క్రాప్ దుకాణాల్లో అమ్మేశారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ఇది ఒక ఫేక్ న్యూస్ అని వాళ్లు స్పష్టం చేశారు. బెగుసరాయ్ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డులో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచామని.. అందులోకి దొంగలు ప్రవేశించి కొన్ని కేబుళ్లను అపహరించారని.. ఈ కేసులో పది రోజుల క్రితం కొందరు దొంగలను అరెస్ట్ చేశామని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో బీరేందర్ కుమార్ వెల్లడించారు. అక్కడ సొరంగం లేదని.. సరిహద్దు దగ్గర కొంత మట్టిని తొలగించడం వల్ల గొయ్యి వంటి చిన్న మార్గం ఏర్పడిందని తెలిపారు. అసలు ఇంజిన్ దొంగతనం జరగలేదని.. కేబుళ్లను దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.
Read Also: Rahul Gandhi: మీసం మెలేసిన రాహుల్ గాంధీ.. ఫోటో వైరల్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాగా బరౌనీ రైల్వేస్టేషన్ సమీపంలో మరమ్మతుల కోసం వచ్చిన ఓ రైలు ఇంజిన్‌ను కొందరు దొంగతనం చేశారని.. ప్రత్యేక సొరంగం మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మార్గం గుండా ఇంజిన్‌లోని రాగి తీగలు, అల్యూమినియం ప్లేట్లను దొంగిలించి సొమ్ము చేసుకున్నారని ఈనెల 18న వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠా నాయకుడు చందన్ కుమార్ సహా మరో ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారని ప్రచారం జరిగింది. దొంగలు ఇచ్చిన సమాచారంతో ముజఫర్‌పుర్ జిల్లాలోని ఓ గోడౌన్‌పై దాడి చేసి దాదాపు రూ.30 లక్షల విలువ చేసే 13 బస్తాల ఇంజిన్ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారని.. గోడౌన్ యజమానికి ముందుగానే దాడుల సమాచారం తెలియడం వల్ల పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడని కూడా రూమర్లు వినిపించాయి. దీంతో రైల్వే అధికారులు స్పందించి దీనిపై వివరణ ఇచ్చారు.
Read Also: Manish Pandey: అప్పుడు నా కెరీర్ నాశనం చేశారు.. ఇప్పుడు శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!