NTV Telugu Site icon

Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్ చోరీ.. స్పందించిన రైల్వేశాఖ

Rail Engine

Rail Engine

Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్‌ను కొంతమంది దొంగలు మాయం చేశారని.. సొరంగంలోకి ఇంజిన్‌ను తీసుకువెళ్లి ముక్కలుగా మార్చి వివిధ జిల్లాలోని స్క్రాప్​ దుకాణాల్లో అమ్మేశారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ఇది ఒక ఫేక్ న్యూస్ అని వాళ్లు స్పష్టం చేశారు. బెగుసరాయ్​ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డులో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచామని.. అందులోకి దొంగలు ప్రవేశించి కొన్ని కేబుళ్లను అపహరించారని.. ఈ కేసులో పది రోజుల క్రితం కొందరు దొంగలను అరెస్ట్​ చేశామని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో బీరేందర్ కుమార్ వెల్లడించారు. అక్కడ సొరంగం లేదని.. సరిహద్దు దగ్గర కొంత మట్టిని తొలగించడం వల్ల గొయ్యి వంటి చిన్న మార్గం ఏర్పడిందని తెలిపారు. అసలు ఇంజిన్ దొంగతనం జరగలేదని.. కేబుళ్లను దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.

Read Also: Rahul Gandhi: మీసం మెలేసిన రాహుల్ గాంధీ.. ఫోటో వైరల్

కాగా బరౌనీ రైల్వేస్టేషన్ సమీపంలో మరమ్మతుల కోసం వచ్చిన ఓ రైలు ఇంజిన్‌ను కొందరు దొంగతనం చేశారని.. ప్రత్యేక సొరంగం మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మార్గం గుండా ఇంజిన్‌లోని రాగి తీగలు, అల్యూమినియం ప్లేట్లను దొంగిలించి సొమ్ము చేసుకున్నారని ఈనెల 18న వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠా నాయకుడు చందన్​ కుమార్‌ సహా మరో ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారని ప్రచారం జరిగింది. దొంగలు ఇచ్చిన సమాచారంతో ముజఫర్‌పుర్‌ జిల్లాలోని ఓ గోడౌన్​‌పై దాడి చేసి దాదాపు రూ.30 లక్షల విలువ చేసే 13 బస్తాల ఇంజిన్​ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారని.. గోడౌన్​ యజమానికి ముందుగానే దాడుల సమాచారం తెలియడం వల్ల పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడని కూడా రూమర్లు వినిపించాయి. దీంతో రైల్వే అధికారులు స్పందించి దీనిపై వివరణ ఇచ్చారు.

Read Also: Manish Pandey: అప్పుడు నా కెరీర్ నాశనం చేశారు.. ఇప్పుడు శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు