Site icon NTV Telugu

Rahul Gandhi: “శానిటరీ ప్యాడ్‌ ప్యాకెట్ల”పై రాహుల్ గాంధీ బొమ్మ.. కాంగ్రెస్‌పై విమర్శలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: బీహార్‌లో మహిళలకు పంపిణీ చేయాలనుకుంటున్న ఉచిత ‘‘శానిటరీ ప్యాడ్స్’’పై రాహుల్ గాంధీ బొమ్మ ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది. మహిళల కోసం ఇచ్చే ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ముఖం ఎందుకు ఉందని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మహిళలకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో కాంగ్రెస్ ‘‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’’ కింద ఈ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్ల కోసం ప్రచారంలో భాగమని పార్టీ చెబుతోంది. ప్యాడ్స్‌పై ప్రియాంకా గాంధీ చిత్రం కూడా ఉంది.

Read Also: Ambati Rambabu: మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన.. మాజీ మంత్రి ఫైర్‌

‘‘ఈ ప్రచారం ఇండీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే మై బహిన్ సమ్మాన్ యోజన కింద నెలకు రూ. 2500 స్టైఫండ్ హామీకి అనుగుణంగా ఉంది. మేము ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లను అందించాలని భావిస్తున్నాము’’ అని బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ శుక్రవారం ఉచిత ప్యాడ్‌లతో కూడి ప్యాకెట్లను ప్రదర్శించారు. 5 లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను పంపిణీ చేయనున్నట్లు పార్టీ తెలిపింది, రుతుక్రమ ఆరోగ్యాన్ని పరిష్కరించడం, సామాజిక నిషేధాలను తొలగించడం, గ్రామీణ-పట్టణ ప్రాంతాలలో అవగాహనను వ్యాప్తి చేయడం లక్ష్యమని నొక్కి చెబుతుంది.

రాహుల్ గాంధీ ఫోటో శానిటరీ ప్యాడ్స్ ప్యాకెట్లపై ఉండటాన్ని బీజేపీ, జేడీయూ పార్టీలు విమర్శిస్తున్నాయి. ‘‘కాంగ్రెస్ పార్టీకి ఏమైంది..?’’ అని నితీష్ కుమార్ జేడీయూ పార్టీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలోని మహిళల్ని శక్తివంతం చేయడానికి, వారికి సాధికారత కల్పించడానికి, వారి సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరం వచ్చింది; మహిళలు గౌరవానికి చిహ్నం, కానీ మీరు, అహంకారంతో దానిపై మీ ముఖాన్ని (శానిటరీ ప్యాడ్‌లు) ఉంచారు’’ అని విమర్శించారు. ఈ

Exit mobile version