NTV Telugu Site icon

Rahul Gandhi: షేక్ హసీనాను గద్దె దింపడం వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందా..?

Rahul

Rahul

Rahul Gandhi: బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇవాళ భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్‌కు కేంద్ర మంత్రులు సహా ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే వెళ్లారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లపై ఈ సమావేశంలో నేతలు ప్రధానంగా చర్చించారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అందరికి వివరించారు. ఈ సందర్భంగా జైశంకర్‌కు ఇండియా కూటమి విపక్ష నేత రాహుల్‌ గాంధీ మూడు కీలక ప్రశ్నల్ని సంధించారు.

Read Also: Stock Market Crash : బూడిదలో పోసిన పన్నీరైన రూ.86వేల కోట్ల అదానీ, అంబానీల సంపద

అయితే, ఢాకాలో ప్రభుత్వ మార్పిడితో దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఉందా..? అని కేంద్ర సర్కార్ ను రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక, షేక్ హసీనాను గద్దె దింపేందుకు గత కొన్ని వారాలుగా బంగ్లాలో జరిగిన నాటకీయ పరిణామాల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. ప్రత్యేకించి పాకిస్థాన్‌ ప్రమేయం ఏమైనా ఉందా..? అని రాహుల్‌ ప్రశ్నించాగా.. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందర పాటు అవుతుందని జై శంకర్ బదులిచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు ఆందోళనలకు సపోర్టుగా తన ప్రొఫైల్‌ పిక్‌ను నిరంతరం మారుస్తున్నారని పేర్కొన్నారు.

Read Also: Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్‌గా రికార్డు!

అలాగే, బంగ్లాదేశ్‌లో నాటకీయ పరిణామాలను భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఊహించిందా అని కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్రమంత్రిని ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ.. పరిస్థితిని భారత్‌ పర్యవేక్షిస్తోంది అన్నారు. ఇక, ఈ ఆల్‌ పార్టీ మీటింగ్‌లో పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతును ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.