NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ.. విషయం ఏంటంటే..

Pm Modi

Pm Modi

Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్ అంశంపై రేపు పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరుతూ లేఖలో రిక్వెస్ట చేశారు. జూన్ 28న ప్రతిపక్షాలు ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. నిన్న కూడా ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చించేందుకు అనుమతిని మరోసారి కోరాయని, దీనిపై ప్రభుత్వంలో చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్ భరోసా ఇచ్చారని లేఖలో చెప్పారు.

Read Also: Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో విమాన సౌకర్యాలు..!

24 లక్షల మంది నీట్ ఔత్సాహికుల తరుపున సరైన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. లక్షల కుటుంబాల అనేక త్యాగాలు చేసి వారి పిల్లల్ని చదివిస్తున్నారని, పేపర్ లీకుల ద్వారా వారి జీవిత కలలకు వెన్నుపోటు పొడిచారని లేఖలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు, విద్యార్థులు దీనిపై చర్చించాలని, సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని అన్నారు. గడిచిన ఏడేళ్లలో 70కి పైగా పేపర్లు లీకులు అయ్యాయని ఆరోపించారు. దీని వల్ల 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమైనట్లు చెప్పారు. కేంద్ర తమ తప్పుల్ని కవర్ చేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ని మార్చారని దుయ్యబట్టలారు.

మన విద్యార్థులు సమాధానాలు తెలుసుకునేందుకు అర్హులని, పార్లమెంట్‌లో చర్చించడం ద్వారా వారిలో నమ్మకం నిలపగలమని లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రేపు నీట్ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు అనుమతించాలని కోరారు.