NTV Telugu Site icon

No-confidence Motion: రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ప్రారంభించనున్న రాహాల్‌ గాంధీ!

Rahul Gandhi

Rahul Gandhi

No-confidence Motion: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తోపాటు .. బీఆర్‌ఎస్‌ కూడా మోడీపై అవిశ్వాసం కోసం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోడీపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతించిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదిల్లో చర్చించడానికి గతంలోనే స్పీకర్‌ తేదిలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది.

Read also: Chiranjeevi: ఏంటి.. బాసూ.. దిల్ రాజునూ అలా ఆడేసుకున్నావ్

మోడీ ఇంటిపేరు కేసులో సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నాలుగు నెలల క్రితం రాహుల్‌ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల జైలుశిక్షని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్ట్ స్టే విధించింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియేట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం తిరిగి తన పార్లమెంటు సభ్యత్వాన్ని పొందారు. పార్లమెంటు సభ్యత్వం తిరిగి రావడంతో.. రాహుల్‌ గాంధీ సోమవారం పార్లమెంటుకు హాజరయ్యారు. మంగళవారంనాడు జరిగే అవిశ్వాస తీర్మానం చర్చలో రాహుల్ కీలకం కానున్నారు. మణిపూర్‌లోని హింసాత్మక ప్రాంతాలను రాహుల్ సందర్శించడం కూడా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ఉపయుక్తంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.