Site icon NTV Telugu

Rahul Gandhi: నేడు గుజరాత్‌లో రాహుల్ గాంధీ పర్యటన

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగనుంది. మాజీ పీసీసీ అధ్యక్షులు, గుజరాత్ పీసీసీ సీనియర్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: మద్యం మత్తులో యువతుల హల్చల్.. బైక్ను ఢీ కొట్టిన కారు..

అనంతరం ఉదయం10:30 గంటలకు అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌లో గుజరాత్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఇక మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

ఇది కూడా చదవండి: YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షి మృతి.. కడప ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version