Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెప్పింది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని ‘‘సీరియస్’’గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు.
ఇటలీ (డిసెంబర్ 30 నుండి జనవరి 9), వియత్నాం (మార్చి 12 నుండి 17), దుబాయ్ (ఏప్రిల్ 17 నుండి 23), ఖతార్ (జూన్ 11 నుండి 18), లండన్ (జూన్ 25 నుండి జూలై 6),మలేషియా (సెప్టెంబర్ 4 నుండి 8) వంటి దేశాలకు గాంధీ చేసిన విదేశీ పర్యటనలను CRPF అధికారి ప్రస్తావించారు. CRPF యొక్క ఎల్లో బుక్‌లో పేర్కొన్న ప్రోటోకాల్‌లను రాహుల్ గాంధీ ఉల్లంఘిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. అయితే, ఈ విషయంపై రాహుల్ కానీ, ఖర్గే కానీ స్పందించలేదు.
Read Also: Charlie Kirk: “ఆపరేషన్ సిందూర్” గురించి హత్యకు గురైన చార్లీ కిర్క్ ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష్ నేత రాహుల్ గాంధీకి ప్రస్తుతం అడ్వాన్సుడ్ సెక్యూరిటీ లైజన్(ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. Z+ ASL అనేది గణనీయమైన ముప్పును ఎదుర్కొంటున్న వ్యక్తులకు కల్పించే అత్యున్నత భద్రత. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలతో సహా దాదాపు 55 మంది భద్రతా సిబ్బందిని కలిగి ఉంటుంది. ASL కింద, భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులు, నిఘా అధికారుల సమన్వయంతో వీఐపీలు సందర్శించే ప్రదేశాల్లో ముందస్తు నిఘా నిర్వహిస్తారు.
సీఆర్‌పీఎఫ్ ఇలా లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2022లో రాహుల్ గాంధీ 2020 నుంచి 113 సార్లు భద్రతా మార్గదర్శకాలనున ఉల్లంఘించినట్లు సీఆర్‌పీఎఫ్ తెలిపింది. వీటిలో భారత్ జోడో యాత్ర కూడా ఉంది. 2023లో కాశ్మీర్‌లో యాత్ర సాగిన సమయంలో భద్రతా ఏర్పాట్లలో లోపాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. డిసెంబర్ 24న భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరినప్పుడు భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.
