NTV Telugu Site icon

Rahul gandi: ప్రధాని మోడీకి రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి

Rahul

Rahul

స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని మోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి చేశారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానికి రాహుల్‌ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మణిపూర్ పౌరులతో రాహుల్ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో రాహుల్ షేర్‌ చేశారు. భద్రత విషయంలో ఆందోళన, ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తమ ముఖాలను చూపొద్దని వారు విజ్ఞప్తి చేశారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఇది రైలు కాదు గురూ.. ఇల్లు (వీడియో)

గతేడాది మేలో మణిపూర్‌లోని కుకీ, మెయితీ జాతుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 200 మందికిపైగా మరణించారు. ఈ ఘర్షణ చోటు చేసుకున్న నాటి నుంచి ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ మూడు సార్లు పర్యటించారు. జులైలో సైతం రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంఫాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ చాలా కాలం క్రితం మణిపూర్‌లో పర్యటించారన్నారు. మరోసారి ఈ రాష్ట్రంలో పర్యటించి.. మణిపూర్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. మణిపూర్ ప్రజలే కాదు.. దేశ ప్రజలంతా ఆ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించాలని కోరుకుంటున్నారని తెలిపారు. అలా పర్యటించడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజల భావాలను ప్రధాని మోడీ తెలుసుకుంటారనే భావన వారిలో వ్యక్తమవుతుందని చెప్పారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని ప్రధాని మోడీకి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.