NTV Telugu Site icon

Rahul gandhi: సోమవారం మణిపూర్‌లో రాహుల్ పర్యటన!

Raehei

Raehei

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జూలై 8న మణిపూర్‌లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో మే, 2023 నుంచి జాతి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్ని నెలల పాటు ఉద్రిక్తతలు నడిచాయి. ఇక రాహుల్ గాంధీ తన పర్యటనలో సహాయ శిబిరాలను సందర్శించి.. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులతో రాహుల్ చర్చలు జరపనున్నారు.

ఇది కూడా చదవండి: Rainy season Footcare: వర్షాకాలంలో పాదాల సంరక్షణ తప్పనిసరి..లేదంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తప్పవు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల రాజ్యసభలో తన ప్రసంగంలో మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందన్నారు. 11,000 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని.. 500 మందికి పైగా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Anakapalli: మైనర్ బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి.. బాలిక మృతి

Show comments