Site icon NTV Telugu

Rahul Gandhi: ‘40% కమిషన్’పై రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు కోర్టు సమన్లు..

Congress

Congress

Rahul Gandhi: కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.

Read Also: Paytm: పేటీఎంకి ఊరట.. యూపీఐ లావాదేవీలపై ఎన్‌పీసీఐకి ఆర్బీఐ కీలక సూచన..

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ‘పేసీఎం’ వంటి పోస్టర్లను ప్రచురించింది. 40 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించింది. ఈ ప్రకటనపై బీజేపీ లీగల్ విభాగం ఫిర్యాదుపై, కాంగ్రెస్ నేతలు మార్చి 28న ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో హాజరుకావాలని కోరింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు 40 శాతం కమీషన్ ఆరోపణలపై ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే తరహా ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తోంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం కర్ణాటక ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. కాంగ్రెస్ పాలనలో 40 శాతానికి బదులుగా 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి బి శివరాము సొంతపార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన కొద్ది రోజుల తర్వాత కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితి మరింత దిగజారిందని శివరాము పేర్కొన్నారు.

Exit mobile version