Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951’’లోని సెక్షన్ 8(3) ప్రకారం అనర్హత వేటు పడుతుంది. అయితే తాజాగా ఆయన తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. “డిస్ క్వాలిఫై ఎంపీ” అంటూ ప్రొఫైల్ లో మార్పులు చేశారు.
Read Also: Ranga Reddy Crime: చికెన్ కోసం వెళ్లాడు.. ప్రాణాలు కోల్పోయాడు..
2019 కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ముందు కోలార్ లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువునష్టం దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో న్యాయమూర్తి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఆ వెంటనే ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం పార్లమెంటరీ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ ఆదివారం పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి మద్దతుగా సత్యాగ్రహాలకు పిలుపునిచ్చింది.
ప్రస్తుతం రాజకీయం అంతా రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతోంది. బీజేపీ కావాలనే ప్రతిపక్షాలను అణిచివేస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు రాహుల్ గాంధీ అనర్హత వేటుపై వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి పలు ప్రశ్నలు సంధించారు. అదానీ-మోదీల మధ్య సంబంధాన్ని తెలపాలంటూ, రూ. 20,000 కోట్ల పెట్టుబడులను అదానీ షెల్ కంపెనీల్లో ఎవరు పెట్టారని ప్రశ్నించారు. తాను జైలులో పెట్టినా, డిస్ క్వాలిఫై చేసినా ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతానని రాహుల్ గాంధీ అన్నారు. నా స్పీచ్ కు ప్రధాని భయపడుతున్నారని, ఆయన కళ్లలో భయం చూశానంటూ వ్యాఖ్యానించారు.