Site icon NTV Telugu

Rahul Gandhi: దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో యాత్రకు స్పందన.. హిందీ బెల్ట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Rahul Gandhi says Congress will form govt in Hindi belt: దక్షిణాదిలో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భారత్ జోడో యాత్ర’కు మంచి స్పందన వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. హర్యానా కురుక్షేత్రలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర భయం, ద్వేషం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటికి వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, హిందీ బెల్టులో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. కొంతమంది యాత్రకు ముందు బీజేపీ రాష్ట్రాల్లో ప్రజల నుంచి రెస్పాన్స్ రాదని కొంతమంది చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగా ప్రజామద్దతు లభిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.

Read Also: Joshimath Sinking: కుంగిపోతున్న జోషిమఠ్ పట్టణం.. పీఎంఓ అత్యవసర సమావేశం

కేరళలో యాత్ర జరుగుతున్న సమయంలో కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ప్రజా మద్దతు లభించదని అన్నారు.. కానీ ప్రజలు జోడోయాత్రలో భాగమయ్యారని అన్నారు. యాత్ర మహారాష్ట్రకు చేరుకున్నప్పుడు దక్షిణాదితో పోలిస్తే మెరగైన స్పందన వచ్చిందన్నారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉందని అక్కడ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. రైతులు, పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ బీజేపీ మనస్సులో ఉందని.. రాహుల్ గాంధీ మనసులో బీజేపీ లేదని, నా ఇమేజ్ గురించి నేను పట్టించుకోనని అన్నారు. భగవద్గీతను గుర్తు చేస్తూ.. మీ పని చేయడం ఫలితం గురించి ఆలోచించకండి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

దేశంలో ప్రజలను మతం ప్రాతిపదికన విభజించి విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బీజేపీని విమర్శించారు. కాంగ్రెస్ గతంలో ఇలా ఎప్పుడైనా చేసిందా..? అని ప్రశ్నించారు. ఇంధన ధరలు, ఎగుమతి విధానం, బీమా ధరలు, ఎరువుల ధరలతో దేశంలో అన్ని వైపుల నుంచి రైతులపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ దేశాన్ని ప్రేమిస్తుందని.. మేము మా ప్రజలకు, రైతులకు, పేదలకు ప్రేమ పంచుతామని.. వారితో కలిసి నడవాలని అనుకుంటున్నామని అన్నారు. దేశంలో కొంతమంది మాత్రమే సంపద, మీడియా ఇతర సంస్థలను నియంత్రిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Exit mobile version