Donald Lu: అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే సిక్కు, రిజర్వేషన్ వ్యాఖ్యలపై ఆయనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు సిక్కులు నిన్న సోనియాగాంధీ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ కలుస్తున్న వ్యక్తులపై కూడా ఆందోళన నెలకొంది. భారత బద్ధవ్యతిరేకి, పాకిస్తాన్ అంటే ప్రేమ కలిగిన అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడం వివాదంగా మారింది. పలు సందర్భాల్లో భారత వ్యతరేక తీర్మానాలను ప్రవేశపెట్టిన ఈమెతో రాహుల్ గాంధీ భేటీ అవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దను వ్యతిరేకించడంతో పాటు అమెరికా చట్టసభలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించింది.
ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తుల్లో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త కూడా ఉన్నాడు. ఇతను అమెరికా ప్రభుత్వం తరుపున సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా వ్యవహరాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే, ఇతడిని కలిస్తే సమస్య ఏంటని చాలా మంది అనుకోవచ్చు కానీ, ఇతను వెళ్లిన ప్రతీచోట ప్రభుత్వాలు దిగిపోవడం, తిరుగుబాటు రావడం జరిగింది.
Read Also: Tarvinder Singh Marwah: ‘‘మీకు మీ నానమ్మ గతే’’.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
రెజిమ్ ఛేంజ్(పాలన మార్పిడి)లో ఇతడిని నిపుణుడిగా పరిగణిస్తారు. గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలో నుంచి దిగిపోయేందుకు ఇతడి కుట్ర కారణమనే ఆరోపణలు ఉన్నాయి. చివరు స్వయంగా ఇమ్రాన్ ఖాన్ కూడా డొనాల్డ్ లూ కుట్ర వల్లే తన దిగిపోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతకుముందు శ్రీలంకకు వెళ్లిన తర్వాతే గోటబయ రాజపక్సపై తిరుగుబాటు ప్రారంభమైంది. తాజాగా బంగ్లాదేశ్ రిజర్వేషన్ అల్లర్లు, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడంలో కూడా ఇతడి ప్రమేయం ఉంది. గతంలో కిర్గిజ్‌స్తాన్ దేశానికి వెళ్లాడు, అక్కడ రాయబారిగా ఉన్న సమయంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. అల్బానియాలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం రాహుల్ గాంధీ, డొనాల్డ్ లూ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ పర్యటనపై మెకికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ఈ భేటీ సాధారణ సమావేశాల్లో భాగంగానే జరిగిందని చెప్పారు. ఈ డొనాల్డ్ టూ సెప్టెంబర్ ఈ వారంలో బంగ్లాదేశ్, ఇండియాలో పర్యటించబోతున్నారు. ఇండియా-అమెరికా మధ్య జరిగే 2+2 విదేశాంగ, డిఫెన్స్ మంత్రిత్వ శాఖల మధ్య జరిగే సమావేశంలో ఈయన పాల్గొనబోతున్నారు.