Site icon NTV Telugu

Rahul Gandhi: ‘‘ఓట్ చోరీ’’పై ఈసీ ఇప్పటిదాకా స్పందించలేదు.. మరిన్ని ఆధారాలు ఉన్నాయన్న రాహుల్‌గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

ఓట్ల దొంగతనంపై మరోసారి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీపై తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఓట్ల చోరీపై ప్రజెంటేషన్లు కొనసాగుతాయని చెప్పారు. ప్రధాని మోడీ ‘‘చునావ్ చోరీ’’ ద్వారా ప్రధాని అయ్యారని తెలిపారు. బీజేపీ ఓట్ల చోరీపై యువతకు స్పష్టంగా తెలియజేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కల బెడదపై మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హర్యానాలో జరిగిన ఎన్నికలు.. అస్సలు ఎన్నికలే కాదన్నారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించలేదని తెలిపారు. నకిలీ ఓటు, నకిలీ ఫొటోలతో బీజేపీ నాయకులు ఓట్లు వేశారని.. దీనిని బీజేపీ కూడా సమర్థిస్తోందని విమర్శించారు. తన ప్రజెంటేషన్‌లో చూపిస్తున్న చిన్న ఉదాహరణలనే మీడియా తీసుకుంటోందని.. బ్రెజిలియన్ మహిళ ఓటు వేసింది ఎవరని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఒక మనిషి.. ఒక ఓటు అని చెబుతోంది.. కానీ హర్యానాలో మాత్రం ఒక మనిషి.. బహుళ ఓట్లు అని బీజేపీ అంటోందని పేర్కొన్నారు. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే ఒరవడిని బీజేపీ చేయబోతుందన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, గుజరాత్‌లో జరిగింది కూడా ఇదేనన్నారు.

ఇది కూడా చదవండి: Russia: విషాదం.. రష్యాలో అదృశ్యమైన భారతీయ మెడికల్ విద్యార్థి మృతదేహం లభ్యం

బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు ముందు బుధవారం ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హర్యానాలో జరిగిన ఓట్ల చోరీపై అనేక ఆధారాలు చూపించారు. బీజేపీ నేత కుమారుడు రెండు చోట్ల ఓటు వేశారని ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలపై ఇప్పటి వరకు ఈసీ స్పందించలేదు.

 

Exit mobile version