Site icon NTV Telugu

Rahul Gandhi: త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్‌లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ గతంలో ఆరోపిస్తున్నారు.

Read Also: Nellore : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్నం 8 రౌడీషీటర్ల అరెస్ట్

అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అంతే స్థాయిలో బీజేపీ విరుచుకుపడింది. రాహుల్ గాంధీ కామెంట్స్ తనను తాను కించపరుచుకోవడం, దేశ ఓటర్లను అవమానించడమే అని బీజేపీ ఎదురుదాడి చేసింది. రాహుల్ గాంధీ ర్యాలీకి ఉత్తర్ ప్రదేశ్‌లోని డియోరియా నుంచి 20,000 మందిని తీసుకువచ్చారని బీజేపీ ఎద్దేవా చేసింది. బీజేపీ నేత, మాజీ కేంద్రం న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ నేను రాహుల్ గాంధీ మాటలు విన్నప్పుడల్లా, పార్లమెంటు లోపల లేదా వెలుపల, ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది… అణు బాంబు, హైడ్రోజన్ బాంబులకు ఎన్నికలకు ఏం సంబంధం? రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు.

దీనికి ముందు రాహుల్ గాంధీ బీహార్‌లోని ‘‘ఓటర్ అధికార్’’ ర్యాలీని ముగిస్తూ బీజేపీని హెచ్చరించారు. ‘‘మేము బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేయనివ్వము. అందుకే యాత్ర చేపట్టాము. ప్రజల నుంచి ‘ఓట్ చోర్, గద్ది చోర్’ నినాదాలు వచ్చాయి’’ అని అన్నారు. ‘‘ఓట్ చోర్..’’ నినాదం ప్రతీ చోటా ధ్వనిస్తోందని, ఇప్పుడు చైనాకు కూడా చేరుకుందని రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ చైనా ఎస్‌సీఓ పర్యటనను విమర్శించారు. ‘‘ నేను బీజేపీకి చెబుతున్నా, మీరు అణు బాంబు కన్నా పెద్దది ఏదైనా విన్నారా.? ఇది హైడ్రోజన్ బాంబు. బీజేపీ సిద్ధంగా ఉండాలి, హైడ్రోజన్ బాంబు వస్తోంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Exit mobile version