Site icon NTV Telugu

Rahul Gandhi: రాజస్థాన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!

Rahulgandhi

Rahulgandhi

రాజస్థాన్‌ పర్యటనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి వింత పరిస్థితి ఎదురైంది. సవాయి మాధోపూర్‌లోని రణతంబోర్ జాతీయ ఉద్యానవనానికి రాహుల్‌గాంధీ వెళ్తుండగా సడన్‌గా కారు ఆపి.. కాంగ్రెస్ కార్యకర్త చుట్టన్ లాల్ మీనాను పలకరించారు. రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని రాహుల్ అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా ‘సచిన్ పైలట్’ కావాలంటూ సమాధానం ఇచ్చాడు. సచిన్ పైలట్‌కు పగ్గాలు అప్పగిస్తేనే.. రాష్ట్రంలో పార్టీ గాడినపడుతుందని కుండబద్దలు కొట్టినట్లుగా ముఖం మీద చెప్పేశాడు. కార్యకర్త సమాధానంతో రాహుల్‌గాంధీ చిరునవ్వులు చిందించారు.

ఇది కూడా చదవండి: Delhi: రేపటి నుంచి ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2 మూసివేత.. ప్రయాణికులకు అలర్ట్

అశోక్ గెహ్లాట్ కూడా మంచివాడే.. ఇప్పటికే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారని.. ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదని.. కేవలం ఎమ్మెల్యేలు మాత్రం బాగుపడ్డారని చెప్పుకొచ్చాడు. ఉన్నమాట చెబుతున్నా.. అశోక్ గెహ్లా్ట్ తీరు కారణంగానే రాష్ట్రంలో పార్టీ ఘోరంగా నష్టపోయిందని మీనా చెప్పుకొచ్చాడు. పార్టీ బలోపేతం కావాలంటే.. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని మీనా కోరాడు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 11 నుంచి 13 వరకు వ్యక్తిగత పర్యటనలో భాగంగా రణతంబోర్‌లో పర్యటించారు.

ఇది కూడా చదవండి: Visakhapatnam: గర్భిణీ హత్య కేసులో కీలక విషయాలు తెలిపిన స్నేహితులు…

సచిన్ పైలట్ 2018 నుంచి 2020 వరకు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్-సచిన్ మధ్య కుర్చీ వార్ నడిచింది. 2020, జూలై నుంచి రాజస్థాన్ కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళం నెలకొని.. చివరికి అధికారాన్ని కోల్పోయారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది.

ఇది కూడా చదవండి: Nidhi Agerwal : నెటిజన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన నిధి అగర్వాల్..

Exit mobile version