Rahul Gandhi: ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొంటున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ గాంధీ కాన్వాయ్ మధ్యప్రదేశ్ సారంగపూర్ వెళ్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ‘‘జై శ్రీరామ్, మోడీ’’ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసేందుకు కాన్వాయ్ ఆపివేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆయనకు బంగాళాదుంపలు ఇవ్వడం వీడియోలో కనిపించింది. బంగాళాదుంపలను తీసుకుని దానికి బదులుగా బంగారం ఇవ్వాలని రాహుల్‌ని కోరారు.
2017లో గుజరాత్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ బంగాళాదుంపలను బంగారంగా మార్చగల యంత్రాన్ని ఏర్పాటు చేస్తానని రైతులకు హామీ ఇచ్చిన వీడియో వైరల్ అయింది. తాజాగా, ఈ అంశాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ కార్యకర్తలు హైలెట్ చేసినట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ తన కారు వద్దకు తిరిగి వెళ్లే ముందు బీజేపీ కార్యకర్తలతో కరచాలనం చేస్తూ కనిపించారు. బీజేపీ కార్యకర్తల నినాదాల మధ్య రాహుల్ గాంధీ వారికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మార్చి 2, భారత్ జోడో న్యాయ్ యాత్ర రాజస్థాన్ ధోల్‌పూర్ జిల్లా నుంచి మధ్యప్రదేశ్ మొరెనా జిల్లాలోకి ప్రవేశించింది.
The locals of Sarangpur (Madhya Pradesh) welcomed Rahul G with chants of Jai Shree Ram, Modi Modi Modi & a handful of potatoes 🔥🤣🔥 pic.twitter.com/v221KikhQm
— 🦋Anjna🦋🇮🇳 (Modi Ka Parivar) (@SaffronQueen_) March 5, 2024