Site icon NTV Telugu

Tamil Nadu: ‘‘రాహుల్ గాంధీ మాకు బూస్ట్, హార్లిక్స్ ఇస్తున్నారు’’.. విజయ్ తండ్రి ప్రతిపాదనపై కాంగ్రెస్..

Vijay

Vijay

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే, ఈ సారి స్టార్ యాక్టర్ విజయ్ తన పార్టీ టీవీకేతో బరిలో దిగుతుండటంతో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో పొత్తులపై అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే, విజయ్ పార్టీకి కాంగ్రెస్‌తో పొత్తు కుదురుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also: AP Government: గుడ్‌ న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. వారికి ఉచిత విద్యుత్.. పెన్షన్‌ పెంపు..

ఇదిలా ఉంటే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఆహ్వానం వచ్చింది. టీవీకేతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్‌ను విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ కోరారు. తిరువారూర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకోవద్దని సూచించారు. కాంగ్రెస్‌కు గొప్ప చరిత్ర ఉందని, విజయ్ వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని తీసుకుని కాంగ్రెసన్ తన పాత గౌరవాన్ని పొందాలని, ఇప్పుడు నిర్ణయం కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీవీకే కానీ, విజయ్ కానీ అధికారికంగా స్పందించలేదు.

ఇదిలా ఉంటే ఈ ప్రస్తావనపై కాంగ్రెస్ తమిళనాడు చీఫ్ కే సెల్వపెరుంతగై స్పందించారు. ‘‘మా కార్యకర్తలకు ఎలాంటి బూస్ట్ అవసరం లేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌వీటా అన్నీ ఇస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇప్పటికే ఉత్సాహం ఉందని, బయట నుంచి మద్దతు అవసరం లేని చెప్పారు. కాంగ్రెస్, తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేతో పొత్తులో ఉంది. ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతోంది. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో కొనసాగాయి.

Exit mobile version