సోమవారం రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడడంపై ఆయన స్పందిస్తూ ‘దమ్ముంటే చర్చ పెట్టండి’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. మోడీ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్‌ను నడిపించడమే రాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై సస్పెండ్ వేటు ఎత్తి వేయడంతో పాటు పలు సమస్యలపై చర్చలు జరిపించాలని ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. దీంతో సోమవారం కూడా సభను రెండు సార్లు సభను వాయిదా వేశారు. సభలను మాటిమాటికీ వాయిదా వేస్తుండటంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also:
సభలను వాయిదా వేయడంపై దృష్టి పెట్టకుండా దేశ సమస్యలపై చర్చ జరిపించాలంటూ ప్రధాని మోడీకి పరోక్షంగా చురకలంటించారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన సమస్యలు ఇవీ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ”ఇదేం ప్రభుత్వం.. ఈ ప్రభుత్వానికి పార్లమెంట్‌ను ఎలా నడపించాలో కూడా తెలియదు. అధిక ధరలు, లఖింపూర్ ఖేర్ హింసాకాండ, కనీస మద్దతు ధర, లఢఖ్, పెగాసస్ కేసు, సస్సెండ్ అయిన ఎంపీలు.. ఈ విషయాలపై మా గొంతును అణచివేయలేరు, దమ్ముంటే చర్చ జరిపించండి” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
