NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం.. ‘‘కుట్ర’’ అంటున్న కాంగ్రెస్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుండి క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఊహించని విధంగా ఈ ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ నెల 20న రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో టేకాఫ్ కావడానికి 45 నిమిషాలు ఆలస్యమైంది.

Read Also: PM Modi: పీఎం మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

రాహుల్ గాంధీ షెడ్యూల్‌కి అంతరాయం కలిగించడానికి ఇలా టేకాఫ్‌ని ఆలస్యం చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏటీసీ నిర్ణయం రాహుల్ గాంధీ కదలికల కన్నా పీఎం మోడీ ఈవెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఇదే రోజు డియోఘర్‌లో ప్రధాని మోడీ ర్యాలీ నిర్వహించాడు. ‘‘ప్రధాని డియోఘర్‌‌లో ఉన్నందున, రాహుల్ గాంధీని ఆ ప్రాంతం దాటకుండా అనుమతించలేదు. అక్కడ ప్రోటోకాల్ మాకు అర్థమైంది కానీ, కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిందని, ఇలాంటి సంఘటన ఏ ప్రతిపక్ష నాయకుడి కూడా ఎదురుకాలేదు. ఇది ఆమోదయోగ్యం కాదు.’’ అని మహాగామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ అన్నారు.

ఇదిలా ఉంటే, మరోవైపు డియోఘర్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయ్యేందుకు ఆలస్యమైంది. దీంతో ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లడం ఆలస్యంగా మారింది. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలకు ఈ నెల 13న తొలి విడత ఎన్నికలు జరగగా, రెండో విడత 20న జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Show comments