Site icon NTV Telugu

Sanjay Raut: రాహుల్ గాంధీ భారత ప్రధాని కాగలడు.. 2024లో అద్భుతం చేస్తాడు..

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Rahul Gandhi Capable Of Being India’s PM,Says Sanjay Raut: భారత జోడో యాత్రతో దేశంలో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు శనివారం రాహుల్ గాంధీతో కలిసి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం)నేత, ఎంపీ సంజయ్ రౌత్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై సంజయ్ రౌత్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధాని కాగలడని సంజయ్ రౌత్ శనివారం అభిప్రాయం వ్యక్తం చేశారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరుపుతున్న ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ద్వేషం, భయాన్ని తొలగించడమే అని, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం కానది ఆయన అన్నారు. సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు అతీతంగా రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారని.. 2024లో బీజేపీకి సవాల్ గా మారుతారని.. అతను అద్భుతం చేస్తాడని రౌత్ అన్నారు. శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో హత్లీ-చాంద్వాల్ మధ్య రాహుల్ గాంధీతో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. దాదాపు 13 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ గాంధీ గురించి బీజేపీ తప్పుడు అభిప్రాయాలను వ్యాప్తి చేస్తుందని.. ఈ యాత్ర ఆయనపై ఉన్న అపోహలను తుడిచిపెడుతుందని సంజయ్ రౌత్ అన్నారు.

Read Also: Covid Nasal Vaccine: జనవరి 26న కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ప్రారంభం.. టీకా ధర ఎంతంటే..?

భారత దేశానికి ప్రధాని అయ్యే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందా..? అని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎందుకు కారని.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కి.మీ.ల దూరం ప్రతీ ఒక్కరూ కాలినడకన నడవలేరని.. దానికి చాలా ధృడ సంకల్ప కావాలని.. దేశం పట్ల ప్రేమ అవసరం అని అన్నారు. దేశం పట్ల రాహుల్ గాంధీ తనకు ఉన్న శ్రద్ధను చూపించాడు. ఈ యాత్రలో నాకు రాజకీయాలు కనిపించలేదని ఆయన అన్నారు. తాను ప్రధానిగా ఉండటానికి ఇష్టపడనని రాహుల్ గాంధీ చెబుతున్నప్పటికీ.. ప్రజల ఉన్నత పదవిలో చూడాలని అనుకున్నప్పుడు ఆయనకు మరో మార్గం ఉండదని రౌత్ అన్నారు. కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ సాధ్యం కాదని.. దేశంలో ప్రతీమూలలో కాంగ్రెస్ ఉందని, ప్రస్తుతం ఎంపీ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. 2024లో పరిస్థితి మారుతుందని ఆయన అన్నారు.

Exit mobile version