Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాంలో పర్యటిస్తున్నారు. అయితే, ఈ పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన ప్రతిపక్ష నేతకాదని, పార్టీలు చేసుకునే నేత, టూరిస్ట్ లీడర్ అంటూ విమర్శించింది. ఇటీవల, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటించారు. ‘‘రాహుల్ గాంధీ శాశ్వతంగా సెలవుల మూడ్‌లో ఉంటారు’’ అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అన్నారు.
Read Also: Japan: చైనాకు చెక్ పెట్టిన ఇండియా ఫ్రెండ్.. డ్రాగన్ ఆట ముగిసినట్లే!
‘‘రెండు విదేశీ పర్యటన మద్య అతను కొన్ని రోజుల పాటు భారత్ వచ్చి జంగిల్ సఫారీకి వెళ్లి, మళ్లీ విదేశాలకు వెళ్లిపోతారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని నిందిస్తారు. ఇది రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, పరిణతి లేని వ్యక్తి అని చూపిస్తోదని, అందుకే కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా సంతోషంగా లేవు’’ అని అన్నారు. విపక్షాలు రాహుల్‌ను తొలగించి ప్రియాంకాను తీసుకోవాలని కోరుతున్నాయని పూనావాలా అన్నారు. దేశానికి సంబంధించి కీలక సమస్యలు తలెత్తినప్పుడల్లా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం ఒక అనవాయితీగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే జితేంద్ర గోత్వాల్ అన్నారు.
