NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు..? హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై రాహుల్ గాంధీ…

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి తన నివేదికతో భారత్‌లో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సెబీ చైర్‌పర్సర్ మధాబీ పూరి భుచ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు. సెబీ యొక్క సమగ్రత ‘‘తీవ్రంగా రాజీ పడింది’’ అని అన్నారు. ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు భయపడుతున్నారనే దాన్ని హిండెన్‌బర్గ్ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన అన్నారు.

అదానీ గ్రూపుకు వ్యతిరేకం చర్యలు తీసుకోవడానికి సెబీ ఇష్టపడకపోవడానికి దాని అధినేత మధాబీ బుచ్‌కి అదానీ గ్రూపులో వాటాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తూ హిండెన్‌బర్గ్ ఒక రిపోర్టును శనివారం రాత్రి విడుదల చేసింది. “చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ సెబీ యొక్క సమగ్రత, దాని చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీ పడింది” అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వీడియోని విడుదల చేశారు. సెబీ చైర్‌పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

Read Also: Kolkata doctor case: వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు ముందు మద్యం.. విపరీతంగా పోర్న్ వీడియోలు..

దేశవ్యాప్తంగా నిజాయితీగల పెట్టుబడిదారులు ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తున్నారని, సెబీ చైర్‌పర్సన్ ఎందుకు మధాబీపూరి బుచ్ ఎందుకు రాజీనామా చేయాలేని అడుగుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటే ప్రధాని మోడీ, సెబీ చైర్‌పర్సన్, గౌతమ్ అదానీ జవాబుదారీగా ఉంటారా..? అని అడిగారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా పరిశీలిస్తుందా..? అని వీడియోలో ప్రశ్నించారు. మధాబి పూరి బుక్ మారిషస్‌లోని ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో రహస్యంగా పెట్టుబడి పెట్టారని హిండెన్ బర్గ్ ఆరోపించింది.

ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్ నివేదికను బీజేపీతో పాటు పరిశ్రమ వర్గాలు తప్పుపట్టాయి. ఈ నివేదికపై పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు విమర్శలు గుప్పించారు. మరోవైపు తమకు మధాబి పూరి బుచ్‌తో ఎలాంటి సంబంధాలు లేవని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. హిండెన్ బర్గ్ ఎత్తుగడ వెనక కాంగ్రెస్ హస్తం ఉందని ఒక రాజకీయ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. హిండెన్‌బర్గ్ ఎల్లో జర్నలిజంలో మునిగిపోయిందని పలువురు మార్కెట్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.