NTV Telugu Site icon

Priyanka Gandhi: వయనాడ్ ప్రజల కోసం నా ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయి

Priyanka

Priyanka

వయనాడ్ ప్రజల కోసం తన ఆఫీస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. ఎంపీగా గెలిచిన సందర్భంగా వయనాడ్‌లో ప్రియాంక కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సోదరుడు రాహుల్‌గాంధీ సహా ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. వయనాడ్‌ ఎంపీగా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. వయనాడ్ ప్రజల కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. వయనాడ్ ప్రజలు నుంచి తాను నేర్చుకోవల్సింది ఉందని.. అందుకే ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. మీ సమస్యలను లోతుగా అర్థం చేసుకుంటానన్నారు. జంతువులతో ఎదురవుతున్నా సమస్యల గురించి తనకు తెలుసన్నారు. వైద్యం, మెరుగైన విద్యాసంస్థల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. సమస్యలు తెలుసుకోవడానికి మీ ఇంటి తలుపు తడతానన్నారు. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా.. ఆఫీస్ తలుపలు తెరిచే ఉంటాయని వయనాడ్ ప్రజలకు ప్రియాంక హామీ ఇచ్చారు.

వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో ప్రియాంకాగాంధీ భారీ విజయం సాధించారు. 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్‌లో ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం కూడా చేశారు. రాజ్యాంగం ప్రతిని ఓ చేత్తో పట్టుకుని ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే వయనాడ్ సభలో ప్రియాంక, రాహుల్.. ఇద్దరు చిన్నారులతో ముచ్చటించారు. రాహుల్.. ఇద్దరి చిన్నారును ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. అనంతరం ఇద్దరు చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Students Protest: కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రెండు చోట్ల పోటీ చేశారు. రాయ్‌బరేలీ, వయనాడ్‌ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని వదిలేశారు. అనంతరం వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో ప్రియాంకను అభ్యర్థిగా నిలబట్టారు. తొలి ప్రయత్నంలోనే 4 లక్షలకుపైగా మెజార్టీని సాధించారు.