Site icon NTV Telugu

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ 78వ జయంతి.. నివాళులర్పించిన రాహుల్‌, ప్రియాంక

Rahul Gandhi Pays Tribute To Rajiv Gandhi

Rahul Gandhi Pays Tribute To Rajiv Gandhi

Rajiv Gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తూ ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఎంపీ కేసీ వేణుగోపాల్, రాబర్ట్ వాద్రాతో పాటు తదితరులు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కరోనాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ఆమె దూరంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ జన్మదినాన్ని ప్రతి ఏటా సద్భావన దినోత్సవంగా నిర్వహిస్తారు.

 

Monkeypox Test Kit: మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల

ఆగస్టు 20, 1944లో ముంబైలో రాజీవ్‌ గాంధీ జ‌న్మించారు. 1984 అక్టోబ‌రులో ఆయ‌న దేశ ప్రధాని మంత్రిగా ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించారు. అతి పిన్న వ‌య‌సులోనే ప్రధానిగా బాధ్యత‌లు స్వీక‌రించి రాజీవ్ గాంధీ సరికొత్త రికార్డు సృష్టించారు. 1989 డిసెంబ‌ర్ 2 వ‌ర‌కూ ప్రధానిగా ప‌ని చేశారు. కాగా మే 1991లో త‌మిళనా‌డులోని శ్రీపెరంబుదూర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ ఈలం జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version