Site icon NTV Telugu

Rahul Gandhi: గాంధీ హత్య తర్వాత, “ఆర్ఎస్ఎస్” అన్ని సంస్థల్ని ఆక్రమించుకుంటోంది..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ భారత సమాజంలో సమానత్వం యొక్క ప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ‘‘వారు సమానత్వాన్ని నమ్మరు, సోపానక్రమాన్ని నమ్ముతారు. వారు ఉన్నతంగా ఉండాలని నమ్ముతారు’’ అని అన్నారు. మహాత్మా గాంధీ హత్య తర్వాత భారతదేశంలోని అన్ని సంస్థల్ని ఆర్ఎస్ఎస్ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.

Read Also: Jai Anmol Ambani: అంబానీ ఫ్యామిలీకి CBI ఝలక్.. జై అన్మోల్‌పై రూ. 228 కోట్లు బ్యాంకు మోసం ఆరోపణ

సంస్థలపై నియంత్రణ సాధించేందుకు ప్రజాస్వామ్య ప్రక్రియను నేరుగా దెబ్బతీస్తున్నారని, ఎన్నికల సమగ్రతను బలహీనపరుస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తోదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని మూడు ప్రశ్నలు సంధించారు. ఈసీ స్వయంప్రతిపత్తిని బీజేపీ బలహీనపరుస్తోందని, దాని స్వతంత్రతను పునరుద్ధరిస్తారా?, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మధ్య సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఏ రక్షణలు ఉన్నాయి.?, ఈసీ నియమకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తిని ఎన్నికల సెలక్షన్ ప్యానెల్ నుంచి ఎందుకు తొలగించారు? ఆయనపై నమ్మకం లేదా అని బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అడిగారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలే ఎన్నికల కమిషనర్‌ను ఎన్నుకుంటారా? అని ప్రశ్నించారు.

Exit mobile version