Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు అని ప్రకటన
- ఇప్పటికే 45 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయిని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన సుమారు 300 మంది ఎంపీలు మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మంగళవారం నిరసనకు నిర్ణయించిన ప్రదేశానికి వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు తమను అడ్డుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడ నిరసన చేపట్టేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘నిన్న చెప్పినట్లుగానే.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన సుమారు 300 మంది ఎంపీలు CECని కలవాలని అనుకున్నారు. కానీ ఆయన మమ్మల్ని కలవలేదు. ఢిల్లీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. అక్కడ నిరసన చేయడానికి వీల్లేదని నిన్న చెప్పారు’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో అధికారికంగా నిరసనలకు కేటాయించిన జంతర్ మంతర్‌కు వెళ్లి అక్కడే ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Also Read
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
‘100 FIRలు నమోదు చేయండి’
తనపై కేసులు నమోదవుతున్న అంశంపైనా రాహుల్ గాంధీ స్పందించారు. తనపై 100 ఎఫ్ఐఆర్లు నమోదైనా తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘‘నాపై 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి. ప్రతి ఎఫ్ఐఆర్ నాకు ఒక పతకం లాంటిదే’’ అని అన్నారు. ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఖర్గే విందు
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఉన్న సాగర్ రత్న రెస్టారెంట్లో కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల ఆందోళనను కొనసాగించనున్నట్లు తెలిపారు. SIR ప్రక్రియపై తమ అభ్యంతరాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!