BJP: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇప్పటికే అతడి అమెరికా పర్యటనపై వివాదం నెలకొని ఉంది. సిక్కులపై , రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ సెప్టెంబర్ 6 లండన్‌లో ఉన్నారని, సెప్టెంబర్ 15 వరకు మొత్తం 10 రోజులు విదేశాల్లో గడిపారని, అయితే ఆయన మాత్రం కేవలం 5 గంటలు మాత్రమే బహిరంగ సమావేశాలకు కేటాయించారని, మిగతా సమయం ఆయన ఎక్కడకు వెళ్లారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ప్రశ్నించారు. అమెరికాలో అతడి కార్యకలాపాలపై ప్రశ్నల్ని లేవనెత్తారు.
Read Also: Wolf Attack: యూపీలో నరమాంస భక్షక తోడేళ్లు.. 13 ఏళ్ల బాలుడిపై దాడి..
ఎక్స్ వేదిక మాల్వియా రాహుల్ గాంధీ పర్యటనను ప్రస్తావించారు. ‘‘అతను సెప్టెంబరు 6న లండన్‌కు బయలుదేరి 10 రోజులు విదేశాల్లో గడిపి 16న తిరిగి ల్యాండ్ అయ్యాడు. అతను సెప్టెంబరు 9న (టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కార్యక్రమం, భారతీయ ప్రవాసులతో భేటీ, మొత్తం 1.5 గంటల వరకు), 10వ తేదీన (జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమం, భారతీయ ప్రవాసులతో కార్యక్రమం, పత్రికా కార్యక్రమాలతో సహా) కార్యక్రమాలను ప్రచారం చేశాడు. 3.5 గంటలపాటు కొందరు US చట్టసభ సభ్యులను కలుసుకోవడం) ఈ 5 గంటలు తప్ప, విదేశీ గడ్డపై భారతదేశ ప్రతిపక్ష నాయకుడు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 11-15 మధ్య ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. అతను ఎవరిని కలిశారు..? అతడికి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు..? ఈ చీకటి రహస్య పర్యటనలు మాల్వియా ప్రశ్నించారు. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశీ ఏజెన్సీలు, ఆపరేటర్లు కలుసుకున్నట్లు ఆయన అనుమానించారు. దీనికి ముందు రాహుల్ గాంధీ భారత వ్యతిరేకి యూఎస్ చట్టసభ సభ్యురాలు ఇల్హా్న్ ఒమర్‌తో భేటీ కావడాన్ని మాల్వియా ప్రశ్నించారు.