Site icon NTV Telugu

Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

Raghav Chadha Vs Aap1

Raghav Chadha Vs Aap1

ఎంపీ రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని మోడీకి భయపడి.. సమోసాల ధర గురించి మాట్లాడతావా? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ అనురాగ్ ధండా, పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు తర్వాత ఆప్ బహిరంగంగా స్పందించింది.

ఇది కూడా చదవండి: Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

రాఘవ్ చద్దా బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని అనురాగ్ ధండా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వసనీయతను శంకించారు. రాఘవ్ చద్దాను అనురాగ్ ధండా ఎద్దేవా చేస్తూ.. ‘‘మీకు సమోసాల ధర తగ్గించాలా లేక దేశాన్ని కాపాడాలా అని ప్రశ్నించారు. గుజరాత్‌లో అరెస్టు అయిన పార్టీ కార్యకర్తలకు మద్దతుగా పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులపై ఎందుకు ఎటువంటి నిర్దిష్ట చర్య తీసుకోలేదని నిలదీశారు.

మోడీకి భయపడుతూ.. పార్టీ పోరాటాలకు దూరంగా ఉంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా, బహిరంగ వేదికలపై చద్దా పనితీరును అనురాగ్ ధండా ప్రశ్నించారు.  ‘‘రాఘవ్.. నువ్వు గత కొన్నేళ్లుగా భయపడుతున్నావు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నావు. ఎవరు భయపడతారో.. వారు దేశం కోసం ఎలా పోరాడతారు?’’ అని అన్నారు. పార్లమెంటులో ఒక పార్టీకి మాట్లాడటానికి లభించే పరిమిత సమయాన్ని దేశాన్ని కాపాడటానికి ఉపయోగించుకోవాలి తప్ప. విమానాశ్రయాల్లో క్యాంటీన్లలో సమోసాల ధరను తగ్గించడం.’’ వంటి సమస్యలు కాదని వ్యంగ్యంగా అన్నారు.

‘‘పశ్చిమ బెంగాల్‌లో ఓటు హక్కును లాగేసుకుంటున్నారు. సభలో సీఈసీకి వ్యతిరేకంగా ఒక తీర్మానం వచ్చినప్పుడు భాయ్ సాహెబ్ దానిపై సంతకం
చేయడానికి నిరాకరించారు. పార్టీ సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు మోడీకి హాజరును సూచించడానికి కూర్చునే ఉన్నారు. రాఘవ్.. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు భయపడుతున్నావు. దేశంలోని నిజమైన సమస్యలపై మాట్లాడటానికి భయపడుతున్నావు.’’ అని అన్నారు.

సౌరభ్ భరద్వాజ్..
పార్లమెంటులో ఉన్న పరిమిత సమయాన్ని తీవ్రమైన సమస్యలను లేవనెత్తడానికి ఉపయోగించుకోవాలి కదా? అని సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. కానీ రాఘవ్ చద్దా ఆ పాత్రలో చురుకుగా పాల్గొంటున్నట్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. పార్టీ ఎంపీలు వాకౌట్ చేసినప్పుడు కూడా చద్దా సభలోనే ఉంటారని.. అది దేనికి సంకేతం అని అడిగారు.

 

Exit mobile version