Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా?
- రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం వేటుపై బహిరంగంగా స్పందించిన ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని మోడీకి భయపడి.. సమోసాల ధర గురించి మాట్లాడతావా? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్చార్జ్ అనురాగ్ ధండా, పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు తర్వాత ఆప్ బహిరంగంగా స్పందించింది.
ఇది కూడా చదవండి: Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
రాఘవ్ చద్దా బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని అనురాగ్ ధండా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వసనీయతను శంకించారు. రాఘవ్ చద్దాను అనురాగ్ ధండా ఎద్దేవా చేస్తూ.. ‘‘మీకు సమోసాల ధర తగ్గించాలా లేక దేశాన్ని కాపాడాలా అని ప్రశ్నించారు. గుజరాత్లో అరెస్టు అయిన పార్టీ కార్యకర్తలకు మద్దతుగా పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులపై ఎందుకు ఎటువంటి నిర్దిష్ట చర్య తీసుకోలేదని నిలదీశారు.
మోడీకి భయపడుతూ.. పార్టీ పోరాటాలకు దూరంగా ఉంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా, బహిరంగ వేదికలపై చద్దా పనితీరును అనురాగ్ ధండా ప్రశ్నించారు. ‘‘రాఘవ్.. నువ్వు గత కొన్నేళ్లుగా భయపడుతున్నావు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నావు. ఎవరు భయపడతారో.. వారు దేశం కోసం ఎలా పోరాడతారు?’’ అని అన్నారు. పార్లమెంటులో ఒక పార్టీకి మాట్లాడటానికి లభించే పరిమిత సమయాన్ని దేశాన్ని కాపాడటానికి ఉపయోగించుకోవాలి తప్ప. విమానాశ్రయాల్లో క్యాంటీన్లలో సమోసాల ధరను తగ్గించడం.’’ వంటి సమస్యలు కాదని వ్యంగ్యంగా అన్నారు.
‘‘పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కును లాగేసుకుంటున్నారు. సభలో సీఈసీకి వ్యతిరేకంగా ఒక తీర్మానం వచ్చినప్పుడు భాయ్ సాహెబ్ దానిపై సంతకం
చేయడానికి నిరాకరించారు. పార్టీ సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు మోడీకి హాజరును సూచించడానికి కూర్చునే ఉన్నారు. రాఘవ్.. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు భయపడుతున్నావు. దేశంలోని నిజమైన సమస్యలపై మాట్లాడటానికి భయపడుతున్నావు.’’ అని అన్నారు.
సౌరభ్ భరద్వాజ్..
పార్లమెంటులో ఉన్న పరిమిత సమయాన్ని తీవ్రమైన సమస్యలను లేవనెత్తడానికి ఉపయోగించుకోవాలి కదా? అని సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. కానీ రాఘవ్ చద్దా ఆ పాత్రలో చురుకుగా పాల్గొంటున్నట్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. పార్టీ ఎంపీలు వాకౌట్ చేసినప్పుడు కూడా చద్దా సభలోనే ఉంటారని.. అది దేనికి సంకేతం అని అడిగారు.
Just saw ur video Raghav bhai.
I just want to say – “जो डर गया, समझो मर गया” pic.twitter.com/cgXN9cI4aG— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 3, 2026
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!