Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ సంక్షోభం
- ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరిక
- రాఘవ్ చద్దా లక్ష్యంగా ఆప్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా చల్లారలేదు. తిరుగుబాటు ఎంపీలపై ఆప్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాను ఇప్పటి వరకు తప్పుడు పార్టీలో ఉన్నానని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. దీంతో ఆ వ్యాఖ్యలపై సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. రాజ్యసభ ఎంపీని చేయడం వల్లే మీకు పెళ్లైందని.. లేదంటే పిల్లను కూడా ఇచ్చేవారే కాదన్నారు.
ఇక పార్టీలు మారడాన్ని రాఘవ్ చద్దా ఉద్యోగాలతో పోల్చడంపై కూడా కౌంటర్ ఇచ్చారు. ‘‘మనం ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఒక కంపెనీలో పనిచేసినప్పుడు సిద్ధాంతంతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ మీరు సిద్ధాంతం కారణంగానే ఒక పార్టీలో చేరి.. దానిలోనే జీవిస్తారు..’’ అని అన్నారు. అయినా ‘‘ప్రజలు ఉద్యోగాలు మారినప్పుడు కూడా వారు తమ మాతృ సంస్థకు వ్యతిరేకంగా కుట్ర చేయరు.’’ అని అన్నారు. పార్టీ మారే హక్కు ఉంది.. కాదనడం లేదు.. కానీ అందుకు భిన్నంగా కుట్రలు పన్నడం ఏంటి? అని ప్రశ్నించారు. ఏడాదికిపైగా బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతారా? అని నిలదీశారు.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
Response to Raghav’s Video
Raghav Chaddha says his changing party is like someone switching a job from one company to another.
Though it’s not the same but even when people switch jobs, they don’t hatch conspiracy against their parent company
For more than a year, Raghav… pic.twitter.com/RxfnTsv9Ms
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 27, 2026
మధ్యతరగతి సమస్యలను లేవనెత్తే యువ రాజకీయ నాయకుడిగా తటస్థను కొనసాగించేందుకు ఏడాదికి పైగా కేంద్ర ప్రభుత్వంతో కుట్ర పన్నారని ఆరోపించారు. విమానాశ్రయ విక్రేతలు, మొబైల్ రీఛార్జ్, పితృత్వ సెలవు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల్లో పనిచేసే గిగ్ వర్కర్లకు సంబంధించిన విషయాలతో సహా లేవనెత్తిన అనేక సమస్యలు ఒక అవగాహనలో భాగమని పేర్కొన్నారు.
రాఘవ్ చద్దా
ఇక ఆప్ నుంచి విమర్శలు రావడంతో రాఘవ్ చద్దా స్పందిస్తూ.. 15 ఏళ్లుగా పార్టీలో పని చేశానని.. వ్యవస్థాపక సభ్యుడిని అని పేర్కొన్నారు. కెరీర్ కోసం రాజకీయాల్లోకి రాలేదని.. 15 ఏళ్ల ఉజ్వల భవిష్యత్‌ను పార్టీకి అంకితం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. సరైన వ్యక్తినే కానీ.. తప్పుడు పార్టీలో ఉన్నానని అర్థమైందన్నారు. భయంతో కాదు.. నిరాశ, నిస్పృహ, అసహ్యంతోనే బయటకు వెళ్లిపోయినట్లుగా చెప్పకొచ్చారు. ఏడుగురు ఎంపీలు వెళ్లిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!