NTV Telugu Site icon

Lucknow: లక్నో ఎయిర్‌పోర్టులో రేడియోధార్మిక పదార్థం లీక్.. ఖాళీ చేయించిన అధికారులు

Airport

Airport

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో రేడియోధార్మిక పదార్థం లీకైనట్లు సమాచారం రావడంతో తీవ్ర కలకలం రేపింది. కార్గో ప్రాంతంలో లీక్ కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని 1.5 కిలోమీటర్ల మేర ప్రజలను ఖాళీ చేయించారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Jyothi Poorvaaj: ‘బిగ్ బాస్’లోకి హాట్ ఆంటీ!!

కేన్సర్ రోగులకు సంబంధించిన మందులు గువాహటికి వెళ్లే సరుకులో రేడియోధార్మిక పదార్థం లీక్ అయిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం లేదా ప్రాణహాని జరగలేదని విమానాశ్రయాన్ని నిర్వహించే అదానీ గ్రూప్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Venkaiah Naidu: ప్రభుత్వం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు

ఇదిలా ఉంటే ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నెలలుగా రేడియోధార్మిక పదార్థాలను విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించారు. 50 గ్రాములున్న ఈ పదార్థం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.850 కోట్లకుపైగా ఉంటుందని తెలుస్తోంది.

Show comments