NTV Telugu Site icon

Anant Ambani Wedding: రాధిక మర్చంట్ వెడ్డింగ్ రింగ్‌ వైరల్.. స్పెషల్ ఏంటంటే..!

Ar

Ar

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తారాలోకం మెరిసిపోయింది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, రాధికా మర్చంట్‌ల కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రాధికా ధరించిన వెడ్డింగ్ రింగ్ వైరల్ అవుతోంది. అందులో ఏ, ఆర్ అనే రెండు అక్షరాలతో కూడిన రింగ్‌ను పెళ్లి కూతురు ధరించింది. ఏ అంటే అనంత్, ఆర్ అంటే రాధిక అనే అర్థమిచ్చేలా వజ్రపు ఉంగరాన్ని ధరించింది. ఇక పెళ్లి కూతురుగా ధగధర మెరిసిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా చూసేయండి.