NTV Telugu Site icon

JDU: రబ్రీదేవికి సంతకం పెట్టడం రాదు, ఆమె కూడా బడ్జెట్‌పై మాట్లాడుతోంది..

Jdu

Jdu

JDU: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్జేడీడీ నేత, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ ఫైరయ్యారు. బడ్జెట్‌లో సామాన్యులకు ఏమీ లేదని, కేంద్రం బీహార్‌కి బొమ్మ(జుంఝానా) మాత్రమే ఇచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బీజేపీ మిత్రపక్షం జేడీయూ విమర్శలు గుప్పిస్తోంది.

ఆమె వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి(రబ్రీ దేవీ)కి సంతకం ఎలా చేయాలో కూడా తెలియదని, ఆమె బడ్జెట్‌పై ఎలా మాట్లాడుతుంది..? అని ఎద్దేవా చేశారు. బీహార్‌కు రూ.26,000 కోట్లు కేటాయించడం సాధారణ ప్రజల కోసం కాదని, కార్పొరేట్ రంగానికి ఉద్దేశించిన బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్జేడీ విమర్శించింది. ఈ బడ్జెట్ కార్పొరేట్ రంగానికి మాత్రమే అని విమర్శించింది.

Read Also: Ratan Tata: ఒక్క ప్రకటనతో రూ.19 వేల కోట్లు రాబట్టిన రతన్ టాటా..ఆ ప్రకటన ఇదే…

‘‘ ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ రంగానికి మాత్రమే. కేంద్రం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో కేంద్ర ఆర్థిక మంత్రికి ఎలాంటి ఆలోచన లేదు. ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో యువత, రైతులు, మహిళలు, కార్మికుల సమస్యలను ప్రస్తావించలేదు’’ అని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర అన్నారు. బీహార్‌కి ప్రత్యేక హోదా అవసరమని, కేంద్రం దాన్ని తిరస్కరించిందని చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా బీహార్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీహార్‌కి మూడు ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులను కేటాయించింది.